Kashtalanni Vaste Raani
కష్టాలన్నీ వస్తే రానీComposer: Jonah Samuel • Lyricist: Jonah Samuel • Peace & Unshakable Strength in Trials
కష్టాలన్నీ వస్తే రానీ - కన్నీళ్లు ముంచే వస్తే రానీ యేసయ్యా నాతో ఉంటే చాలు - విజయమే నాది శోధనలన్నీ ఎదురైనా - శత్రువు నను చుట్టినా యేసయ్యా నా పక్షమునండగా - భయపడనే నేను జీవితమంటే దేవుని వరమే - ఆ దేవునితోనే నడవాలి మనమే
ఎండ మావుల లాంటి లోకములో - నీ కృప నను తోడు ఉండగా ఆవుల మందలు విడిచిపోయినా - దేవునిలో నేను ఆనందించెదా ఒంటరితనమే నను వేధించినా - అపజయాలే నను కృంగదీసినా యేసయ్య నా చెంత నిలచి - ధైర్యము నాకిచ్చును
ఎక్కలేని కొండలను దాటించి - సముద్రములో దారి చూపిన నీవు ఉంటే కొండ కూడ సమమగు - నీవు ఉంటే ముళ్ళను పువ్వులగు తుఫానులెన్నో ఎదురైనను - నా జీవిత నావ మునిగిపోదులే యేసు నా నావికుడై - ఒడ్డుకు నను చేర్చును
గాయపడిన హృదయముతో - నేను మొరలిడగా వింటివయ్యా కన్నీటి రాత్రులలో - ఓదార్పు ఇచ్చితివి నా శత్రువుల యెదుట నాకు - విందును సిద్ధపరచి తల నూనెతో అంటి - నా గిన్నెను నింపి పొర్లించితివి
Scripture Reference: Romans 8:37 · Isaiah 41:10 · Habakkuk 3:17-18







